నా పేరు జోస్యుల లక్ష్మీకాంత్. నేను ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలో తెలుగు పండితునిగా పనిచేసి 2021లో పదవీవిరమణ చేశాను . వృత్తితో పాటు పద్యాలు, పాటలు, కవితలు రాయడం ప్రవృత్తిగా చేస్తుంటాను. గతంలో నేను "తల్లిపాలభాష, శరణు శరణు " అనే సి.డిలు ఆవిష్కరించాను. ఈ పాటలు రాయడం ద్వారా వచ్చిన గుర్తింపు, ప్రోత్సాహం నన్ను ఈ వెబ్ సైట్ రూపొందించేందుకు దోహదపడింది. మన తెలుగుభాష, సంస్కృతుల గొప్పదనం నాకు తెలిసినంతవరకు అందరికీ తెలియజేయడానికి ఆలంబనయ్యింది. ఈ వెబ్ సైట్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సిలబస్ అనుసరించి 6 నుండి 10 తరగతుల వరకు గల తెలుగు, హిందీ ,సంస్కృతం పాఠ్యాంశాల సమగ్ర వివరణ , సాహిత్య, వ్యాకరణాంశాలు మరియు పండిత మిత్రులకు కావలసిన అదనపు సమాచారం పూర్తి ఉచితంగా అందించాలనే మాప్రయత్నాన్ని మనమిత్రులందరికి తెలియచేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాము .