Welcome to Akshararchana

info@akshararchana.com

+(91) 8977423823

 ఫోటోలు (Gallery)










బోధనోపకరణాలు
TLM


ఈ పాఠ్యాంశానికి చెందిన TLM కావాలంటే కింది బటన్స్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

పదజాలం

కొన్ని అక్షరాల సమూదాయాన్ని 'పదం' అంటారు. ఒక పదానికి ఇన్ని అక్షరాలు ఉండాలనే పరిమితి ఏమీ లేదు. పదాల యొక్క సమూహానికి 'పదజాలం ' అని పేరు.భాషలో ఉపయోగించే ఈ పదాలకు సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది.

తెలుగుభాషలో గల అనంతమైన ఈ పదజాలాన్ని శ్రవణ, భాషణ, పఠన, లిఖిత రూపాలలో అనగా పర్యాయపదాలు, నానార్థాలు,వ్యతిరేకపదాలు, వ్యుత్పత్తులు, ప్రకృతివికృతులు,భాషాభాగాలు ఇలా అనేక విధాలుగా విద్యార్థులకు బోధించబడుతుంది.

జ్ఞానసముపార్జనకు ప్రాథమిక ఉపకరణమైన ఈ పదజాలాన్ని కేవలం పాఠశాలలోనేకాక,చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం, పుస్తకాలు, వార్తాపత్రికలు చదవడం, ప్రముఖుల ఉపన్యాసాలు వినడం ద్వారా నేర్చుకోవాలి. క్రొత్త క్రొత్త పదాలు వాటి అర్థాలను తెలుసుకుని భాషపై పట్టు సాధించాలి.

సందర్భానుసారంగా ఏపదాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో అవగాహన కలిగి ఉండాలి. అవసరమైనచోట తమ భావాలను వ్యక్తీకరించగల నైపుణ్యాన్ని సాధించాలి.
CALL NOW