Welcome to Akshararchana

info@akshararchana.com

+(91) 8977423823

 ఫోటోలు (Gallery)










బోధనోపకరణాలు
TLM


ఈ పాఠ్యాంశానికి చెందిన TLM కావాలంటే కింది బటన్స్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

సంస్కృత వ్యాకరణం

" వ్యాక్రియన్తే శబ్దాః ఇతి వ్యాకరణమ్" అని వ్యాకరణ శబ్దానికి వ్యుత్పత్తి. ప్రకృతి ప్రత్యయ విభాగ పూర్వకంగా నిరూపించబడు పదాలు గల శాస్త్రానికి వ్యాకరణశాస్త్రమని పేరు. సంస్కృతవ్యాకరణం అతి ప్రాచీనమైనది.ఇది ఎప్పుడు ప్రారంభమైనదో తెలియదు. బీజరూపంలో ఉన్న ఈ వ్యాకరణం వైదికపాఠాలలో పరిపూర్ణత చెందినది.

వ్యాకరణమూలమైన అక్షరసమామ్నాయాన్ని తొలుత బ్రహ్మ నుండి బృహస్పతికి, ఇంద్రునికి, భరద్వాజునికి, ఋషులకు వారిద్వారా బ్రాహ్మణులకు బోధించడం జరిగింది. సంస్కృతవ్యాకరణంలో ఐంద్ర, మాహేశ్వర సంప్రదాయాలు ఉన్నాయి. పాణినీవ్యాకరణం మహేశ్వర సంప్రదాయమని చెబుతారు. ఇతడు పాణిని కన్నా ప్రాచీనుడు. మహేశ్వరసూత్రాలు ఇతనివేనని కొందరి అభిప్రాయం.

నటరాజైన పరమశివుడు ఢమరుకాన్ని పధ్నాలుగు మార్లు మ్రోగించగా ఈ సూత్రాలు ఉద్భవించినవని నందికేశ్వరకారిక ద్వారా తెలుస్తున్నది. వీటినే పాణిని గ్రహించాడని కూడా చెబుతారు.

నాలుగు వేల సూత్రాలలో పాణిని రచించిన 'అష్టాధ్యాయి' సాటిలేని సంస్కృతవ్యాకరణ గ్రంథం. ఇది విదేశీ వ్యాకరణ పండితులను సైతం ఆశ్చర్యపరచింది. ఈయన శిష్యడైన వరరుచి దీనికి 'వార్తికాలు' రచించాడు. పతంజలికూడా ఈ సూత్రాలకు మహాభాష్యాన్ని వ్రాశాడు.ఇతరవిద్యలకు కూడా ఈ వ్యాకరణం మార్గదర్శి అని చెప్పవచ్చు.

"వాక్యకారం వరరుచిం
భాష్యకారం పతంజలిం
పాణినిం సూత్రకారం చ
ప్రణతోస్మి మునిత్రయం"

అని, ఈ ముగ్గురికి నమస్కరించి వ్యాకరణాధ్యయనాన్ని ప్రారంభిస్తారు.

CALL NOW