Welcome to Akshararchana

info@akshararchana.com

+(91) 8977423823

 ఫోటోలు (Gallery)










బోధనోపకరణాలు
TLM


ఈ పాఠ్యాంశానికి చెందిన TLM కావాలంటే కింది బటన్స్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

అలంకారాలు

అలంకారం అనేది సంస్కృత పదం. ' అలం' అనే శబ్దం నుండి పుట్టినదే అలంకారం.అలం అంటే భూషణం అని అర్థం. మానవులకు ఆభరణాల వలె కావ్యానికి భూషణం లాంటిది అలంకారం. అలంకారాల ప్రస్తావన ఋగ్వేదంలో కనిపిస్తుంది . "అలంకారోతి ఇతి అలంకారః ", "అలంక్రియతే అనేన ఇతి అలంకారః" అని అలంకార శబ్దానికి వ్యుత్పత్తులు.

కవులు తమ కావ్యాలను పుత్రికగా భావించారు. పోతన గారు మహాభాగవత రచనా ప్రారంభంలో " కావ్య కన్యకన్ కూళల కిచ్చిఅప్పడుపు కూడు భుజించుట కంటె....." అని చెప్పడాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఎంత అందంగా ఉన్నవారికైనా తగిన ఆహార్యం,అలంకారం లేకపోతే ఆహ్లాదకరంగా అనిపించదు.అలాగే కావ్యానికి కూడా అలంకారాలు అంతః సౌందర్యాన్ని, బాహ్య సౌందర్యాన్ని మరింత ప్రకాశింపజేస్తాయి.

కావ్యం ఎంత గొప్పదైనా ఎంతో కొంత చమత్కారాన్ని పండించకపోతే అది అంతగా రాణించదు.కాబట్టి, పద్యాలకు సొబగులు దిద్దాలి. ఇందుకు ప్రధానమైన ప్రక్రియలు అలంకారాలు. పద్యాలలోనే కాకుండా గద్యాలలోనూ కవులు అనేక అలంకారాలను గుది గుచ్చి తమ తమ నైపుణ్యాలను ప్రదర్శించి కావ్యాలను తీర్చిదిద్దారు. ఇలా చేయడం వల్లనే పోతన గారి భాగవతం గాని, మిగిలిన ప్రబంధాలు గాని అత్యంత రమణీయం గాను రసాత్మకంగాను ఉండి పాఠకుల మనస్సులలో చెరగని ముద్ర వేసుకున్నాయి.

ఈ అలంకారాలు కొన్ని శబ్దగాంబీర్యాన్ని, మరికొన్ని భావగాంబీర్యాన్ని కలిగి ఉంటాయి. అయితే,కవులు అలంకారాలను కావ్యాలలో సమయోచితంగా పొందు పరచాలి. కావ్యం విశ్వానికి శ్రేయస్సును కూర్చేది కాబట్టి దోషరహితంగాను, భావాలంకారయుక్తంగాను ఉండాలని కూడా నన్నయ గారు 'ఆంధ్ర శబ్దా చింతామణి' లో వివరించారు. అలంకారం లేకుండా పద్యాన్ని చెప్పకూడదని, అంతేకాక పోలిక కూడా సరైనది ఉండాలని ఆయన అన్నారు.

ఉదాహరణకు,

"దేవదానవుల యుద్ధం కాకోలూకముల పోరు వలె భయంకరముగా సాగుతున్నది."

పై వాక్యంలో పోలిక సమంజసంగా లేదు.

(దేవదానవుల యుద్దాన్ని మదపుటేనుగుల తోనో, పర్వతాలతోనో, సింహాలతోనో పోల్చాలి అలా కాకుండా కాకి, గుడ్లగూబతో పోల్చారు)

అలంకారం లేని పద్యంగాని, పాటగాని చంద్రుడు లేని రాత్రిలా, నీరులేని నదిలా, పూవులు లేని తీగలా అలంకరణ లేని యువతిలా ఉంటుంది. కాబట్టి, విద్యార్థులు పై అంశాలను దృష్టిలో ఉంచుకొని అలంకారాల భేదాలను, వాటి లక్షణాలను చక్కగా అభ్యసించాలి.

CALL NOW