Welcome to Akshararchana

info@akshararchana.com

+(91) 8977423823

 ఫోటోలు (Gallery)










బోధనోపకరణాలు
TLM


ఈ పాఠ్యాంశానికి చెందిన TLM కావాలంటే కింది బటన్స్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

సంధులు

ఇద్దరు రాజుల నడుమ యుద్ధం జరిగే పరిస్థితులు ఏర్పడినపుడు ఇరుపక్షాల ధన ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా ఆపడానికి జరిగే ప్రయత్నమే 'సంధి.' రామరావణ యుద్ధాన్ని గాని, కౌరవ పాండవుల యుద్ధాన్ని గానీ ఇట్టి సంధి ప్రయత్నాలేవీ ఆపలేకపోయినవి.

ఇక వ్యాకరణంలో సంధి అంటే రెండు పదాల లోని అచ్చుల నడుమ జరిగే కొన్ని మార్పులు.సంభాషణా సౌలభ్యం కోసం రెండుపదాలను కలిపి ఉచ్ఛరించినపుడు ఏర్పడిన మార్పులు ఇవి. వ్యాకరణకర్తలు వీటిని విభజించి సూత్రీకరించారు.ఇలా మార్పు జరిగి ఏర్పడిన సంధులలో కొన్ని అచ్సంధులు, మరికొన్ని హల్సంధులు ఉన్నాయి.

"పూర్వ పర స్వరంబులకు పరస్వరంబేకాదేశమగుట సంధి యనంబడు" అని, చిన్నయసూరిగారు సంధికి నిర్వచనం చెప్పారు.

మొదటి పదంలోని చివరి అచ్చుకు,రెండవ పదంలోని మొదటి అచ్చుకు బదులుగా రెండవ పదంలోని మొదటి అచ్చు వచ్చి చేరుతుందిఅని ఈ సూత్రానికి అర్థం. అయితే ఇది అచ్సంధులకు మాత్రమే తప్ప హల్సంధులకు అంతగా వర్తించదు. ఈ సంధులలో కొన్ని ఆగమసంధులైతే, మరికొన్ని ఆదేశసంధులు.

'ఆగమం' అంటే వర్ణాధిక్యం.ఒకవర్ణం మిత్రునివలె మరొక వర్ణం ప్రక్కన వచ్చి చేరుతుంది.'ఆదేశం' అంటే అంతకు ముందు ఉన్న అక్షరం స్థానంలో దానికి బదులుగా శత్రుని వలెమరొక అక్షరం వచ్చి చేరుతుంది.ఈ సంధి కార్యాలు కొన్నింటిలో నిత్యం గాను, వైకల్పికం గాను, బహుళం గాను జరుగుతాయి.' నిత్యం' అంటే సంధి తప్పక జరగడం. 'వైకల్పికం' అంటే సంధి జరిగిన రూపం, జరగని రూపం రెండూ ఉంటాయి. 'బహుళం' అంటే సంధి మార్పులు వివిధ రకాలుగా జరగడం అన్నమాట.ఈ సంధులలో సంస్కృతసంధులు, తెలుగు సంధులు అనే మరో రెండు భేదాలున్నాయి.

కేవలం సంస్కృత, లేదా తత్సమ పదాల మధ్య జరిగేవి 'సంస్కృతసంధులు.' వీటికి పాణిని మహర్షి సూత్రాలు ఆధారం.రెండు తెలుగు పదాలు లేదా ఒక తత్సమపదం మరొక తెలుగు పదం మధ్య జరిగే సంధులు 'తెలుగు సంధులు.' తెలుగు సంధులలో జరిగే మార్పులను సూత్రాలతో సహా చిన్నయసూరి గారు బాలవ్యాకరణం అనే గ్రంథంలో వివరించారు.

పద్యాలలో విసంధి దోషాలు ఉండరాదని ఛందోలక్షణ కర్తలు సైతం హెచ్చరించి యున్నారు.

కావున,విద్యార్థులు బాలవ్యాకరణం లోని సంధిసూత్రాలను తప్పక చదివి భాషానైపుణ్యాన్ని తగిన విధంగా పెంపొందించుకోవాలి.
CALL NOW